రాశిఫలాలు: 28 ఏప్రిల్ 2019 ఆదివారం

రాశిఫలాలు: 28 ఏప్రిల్ 2019 ఆదివారం

మేషం
ఇవాళ మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలోకానీ, వ్యాపారంలో అనుకూలపరిస్థితులు ఏర్పడే సూచనలున్నాయి. 

వృషభం
ఇవాళ ఉద్యోగంలో, వ్యాపారంలో కానీ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్, అనుకున్న మార్పుకానీ చోటు చేసుకుంటుంది.

మిథునం
ఇవాళ పాతమిత్రులను, దూరదేశంలోఉన్నమిత్రులను కలుసుకుంటారు. ఆర్థికవ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువడబ్బుఖర్చయ్యే అవకాశముంటుంది.

కర్కాటకం
ఇవాళ మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదాపడతాయి. అనవసరఖర్చు పైనపడుతుంది. జాగ్రత్త వహించడం మంచిది.

సింహం
ఇవాళ స్నేహితులతో, జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, వినోద కార్యక్రమాలతో రోజుగడుపుతారు. అలాగే వాహనంకొనుగోలు కానీ, భూసంబంధ వ్యవహారాలు ఒకకొలిక్కి వచ్చే సూచనలున్నాయి. 

కన్య
ఇవాళ గృహ సంబంధ వ్యవహారాల్లో మునిగితేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడం, వాహనం కొనుగోలు చేయడం కానీ చేస్తారు. 

తుల
ఇవాళ మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పనివాయిదాపడటం, అలాగే సాయం చేస్తామన్నవారుకూడా సమయానికి మాటమార్చడంతో మానసికంగాఆందోళనకు, అసహనానికి గురవుతారు. పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజుకాదు. 

వృశ్చికం
ఇవాళ ఆరోగ్యవిషయంలో జాగ్రత్త అవసరం. కడుపునొప్పికానీ, ఛాతిలోమంటతో బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. 

ధనుస్సు
ఇవాళ మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీబంధువులను అసహనానికి గురి చేసినవారవుతారు. వారి నమ్మకాన్నికోల్పోకుండా జాగ్రత్తపడండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి.

మకరం
ఇవాళ ఇతరులతో మాట్లాడేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీ మాటతీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే ఇతరులవ్యవహారాల్లో తలదూర్చకండి. ఆ సమస్య మీకు చుట్టుకుంటుంది. 

కుంభం
ఇవాళ స్నేహితులతో, పరిచయస్తులతో గడపడానికి అనువైనసమయమిది. అలాగే మీజీవితభాగస్వామి నుంచి అనుకోని సాయంలభిస్తుంది. మీమధ్య ఉన్న మనస్పర్థ్దలు తొలగిపోతాయి. 

మీనం
ఇవాళ ఆర్థికంగా కొంతసామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైనవస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం.