రాశిఫలాలు: 27 జూన్ 2019 గురువారం

రాశిఫలాలు: 27 జూన్ 2019 గురువారం

మేషం
ఇవాళ మీరు.. మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు.

వృషభం
ఇవాళ మీకు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కాని ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు కానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి.

మిథునం
ఇవాళ మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరగొచ్చు. ఇక, మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. 

కర్కాటకం
ఇవాళ మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీ యానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. 

సింహం
ఇవాళ మీరు దూర ప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీ యానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. 

కన్య
ఇవాళ మీరు తలపెట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. 

తుల
ఇవాళ మీ జీవిత భాగస్వామితో కానీ, కుటుంబ సభ్యులతో కాని ఎక్కువ సమయం గడుపుతారు. కొత్త వస్తువులు కానీ, దుస్తులు కానీ కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు నూతన లావాదేవీలు చేస్తారు.

వృశ్చికం
ఇవాళ మీకు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్థులకు రావలసినబకాయిలువసూలవుతాయి. పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది.

ధనుస్సు
ఇవాళ మీరు పూర్తి చేయాల్సిన పనులు చివరి క్షణంలో వాయిదా పడతాయి. దాని కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. సంతానం లేదా ఆరోగ్యం కారణంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆవేశానికి లోనవకుండా ఉండటం మంచిది. 

మకరం
ఇవాళ మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. కడుపు, ఛాతికి సంబంధించిన అనారోగ్యం బాధించవచ్చు. వాహన కొనుగోలు, భూ సంబంధ లావాదేవిలు చివరి క్షణంలో వాయిదా పడతాయి. ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. 

కుంభం
ఇవాళ మీ ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వాహనం చెడి పోవటం కాని, ప్రయాణం కారణంగా ఇబ్బంది పడటం కానీ జరుగుతుంది. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా సోదరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం. 

మీనం
ఇవాళ మీకు ఆర్థికంగా బాగుంటుంది. అనుకోని చోటు నుంచి డబ్బు వస్తుంది. అయితే ఖర్చులు కూడా ఎక్కువే ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవసరం. వాద, వివాదాలకు దూరంగా ఉండండి. మీరిచ్చే సలహా కూడా వివాదానికి దారి తీసేలా చేయొచ్చు... దాని కారణంగా మీ గౌరవం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చే సూచనలున్నాయి.