రాశిఫలాలు: 04 ఏప్రిల్ 2019 గురువారం

రాశిఫలాలు: 04 ఏప్రిల్ 2019 గురువారం

మేషం
ఇవాళ ఆధ్యాత్మిక కార్యకలాపాలపై దృష్టి సారిస్తారు. ప్రకృతిని ఆరాధిస్తారు. అనారోగ్య సూచనలు ఉన్నాయి కావున జాగ్రత్త వహించడం మంచిది. 

వృషభం 
ఇవాళ ఊహించని ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి. అనవసర ఖర్చులు చేస్తారు. వైద్యశాలల సందర్శనం చేస్తారు. అనారోగ్య సూచనలు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. లాభనష్టాలపై సమాన దృష్టి ఉంటుంది. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. 

మిథునం 
ఇవాళ సామాజిక అనుబంధాల్లో లోపాలు ఉంటాయి. నూతన పరిచయస్తులతో అప్రమత్తత అవసరం. మోసపోయే అవకాశం ఉంటుంది. భాగస్వాములు జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఆలోచించి అడుగు ముందుకు వేయడం మంచిది. 

కర్కాటకం 
ఇవాళ పోటీల్లో గెలుపు సాధిస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తి విద్యలో రాణింపు ఉంటుంది. రోగనిరోధక శక్తి ఉంటుంది. వ్యాయామం అవసరం. 

సింహం 
ఇవాళ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఉన్నత విద్యలపై ఆసక్తి ఏర్పడుతుంది. ఆత్మీయత లోపిస్తుంది. సృజనాత్మకత కోల్పోతారు. కళలపై ఆసక్తి తగ్గుతుంది. ఆలోచనల్లో వైవిధ్యం ఏర్పడుతుంది.

కన్య 
ఇవాళ సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రాణాయామం చేయాలి. మాతృసౌఖ్యం వల్ల ఇబ్బందులు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

తుల 
ఇవాళ సేవకజన సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలపై దృష్టి పెడతారు. ప్రయాణాల్లో సంతోషం కనిపిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. అన్ని రకాల ఆదాయాలు అనుకూలిస్తాయి. సహోద్యోగులతో అనుకూలత ఏర్పడుతుంది. 

వృశ్చికం 
ఇవాళ మాటల వల్ల ఇబ్బందులు ఎదరయ్యే సూచలను కనిపిస్తున్నాయి. కుటుంబంలో అలజడి ఏర్పడుతుంది. ఆర్థిక నిల్వలు, స్థిరాస్తులు కోల్పోయే ప్రమాదం ఉంది.

ధనుస్సు 
ఇవాళ శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనులలో ఆలస్యం ఏర్పడుతుంది. పట్టుదలతో కార్యసాధన అవసరం. చిత్త చాంచల్యం పెరుగుతుంది.  ప్రణాళికాబద్ధమైన లోపాలు ఉంటాయి. ఆలోచనల్లో మార్పులు వస్తాయి. 

మకరం 
ఇవాళ ప్రకృతిని ఆరాధిస్తారు. ప్రకృతిపై ఆసక్తి పెరుగుతుంది.   పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తారు. 

కుంభం 
ఇవాళ శ్రమలేని సంపాదనపై ఆలోచన పెరుగుతుంది. సమిష్టి ఆశయాలు ఉంటాయి. సేవకులద్వారా ఆదాయాలు వస్తాయి. సంఘవ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఇతరులపై ఆధారపడి ఉంటారు. 

మీనం 
ఇవాళ ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. సంఘంలో గౌరవంకోసం ఆరాటం. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ధోరణి ఏర్పడుతుంది. పెద్దలంటే గౌరవం ఉంటుంది. రాజకీయాలపై దృష్టి సారిస్తారు.