రాశిఫలాలు: 05 ఏప్రిల్ 2019 శుక్రవారం

రాశిఫలాలు: 05 ఏప్రిల్ 2019 శుక్రవారం

మేషం
ఇవాళ మీ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి.. ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి అధికంగాఉంటుంది. శివారాధన చేస్తే వీటినించి బయటపడతారు.

వృషభం
ఇవాళ ఆహ్లాదకరమైన రోజు. ఇష్టమైనా వారితో గడుపుతారు. బంధుమిత్రుల సమాగమం. శుభకార్యాల్లో పాల్గొనడం అలాగే పాతమిత్రులను కలుసుకోవడం జరుగుతుంది. 

మిథునం
ఇవాళ అనుకున్న పనులు పూర్తవుతాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీలక్ష్యం నెరవేరుతుంది. ధన లాభం చేకూరి సూచనలు కనిపిస్తున్నాయి.

కర్కాటకం
ఇవాళ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి.. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత కరువవుతోంది. అలసట, నీరసం అధికంగాఉంటాయి. 

సింహం
ఇవాళ మీ తోటి ఉద్యోగులతో, పైఅధికారులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. మీఅజాగ్రత్త కారణంగా వారికోపానికి గురయ్యే అవకాశముంది. వారితో వాదనకు దిగకపోవడం మంచిది. 

కన్య
ఇవాళ మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోద యాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉండొచ్చు.

తుల
ఇవాళ మీరు అనుకున్న పనులు పూర్తి చేయటానికి, కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలమైన రోజు. అలాగే చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీపనికి తగిన గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం
ఇవాళ ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకపోవడం మంచిది. 

ధనుస్సు
ఇవాళ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. 

మకరం
ఇవాళ ఆర్థికంగా కలిసివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూసంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలుఅందుతాయి. 

కుంభం
ఇవాళ మీరు చేపట్టే పనుల్లో అవరోధాలు ఏర్పడుతాయి. ముఖ్యంగా మీ కార్యాలయంలో మీరు చేయాలనుకున్న పనికి సహోద్యోగులనుంచి వ్యతిరేకత రావొచ్చు. ఆవేశానికి లోనుకాకుండా సామరస్య పూర్వకంగా వ్యవహరించండి. 

మీనం
ఇవాళ అదృష్టం కలిసి వచ్చే రోజు. మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. మీతోటి వారి నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కానీ ప్రశంసలందుకుంటారు.