ఆగస్టు 10, 2020 సోమ‌వారం దినఫలాలు

ఆగస్టు 10, 2020 సోమ‌వారం దినఫలాలు

మేషం:  సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

వృషభం: సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమ తప్పదు. ఆధ్యాత్మిక చింతన. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిడుదుడుకులు.

కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. వాహనాలు కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కన్య: ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

తుల: మిత్రులు ఒత్తిడులు పెంచుతారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

వృశ్చికం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. విందువినోదాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. 

ధనుస్సు: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ధనవ్యయం.

మకరం: పనులు చకచకా సాగుతాయి. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

కుంభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. వేడుకల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి.