ఆగస్టు 11, 2020 మంగ‌ళ‌‌వారం దినఫలాలు

ఆగస్టు 11, 2020 మంగ‌ళ‌‌వారం దినఫలాలు

మేషం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.
పరిహారం: పేదలకు కాయగూరలు దానం చేయండి. 

వృషభం: పనులలో పురోగతి సాధిస్తారు. సంఘంలో ఆదరణ. సోదరులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
పరిహారం: ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం పారాయణ 

మిథునం: నూతన ఉద్యోగలాభం. కొత్త విషయాలు తెలుస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
పరిహారం:  పేద విద్యార్ధులను ప్రోత్సహించండి. 

కర్కాటకం: మిత్రులతో వివాదాలు. ప్రయాణాలు వాయిదా. పనులలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
పరిహారం: శంఖం లో పోసిన గంగాజలం తో శివాభిషేకం 

సింహం: దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
పరిహారం: నూవుల నూనెతో శరీర మర్దన చేయండి. 

కన్య: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం. సన్మానాలు. విద్యావకాశాలు దక్కుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
పరిహారం: ఉపవాసం ఉండి కార్తికేయ స్వామిని పూజించండి. 

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. సోదరులతో సఖ్యత. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
పరిహారాలు : 11 తామర పుష్పాలు లక్ష్మీదేవికి సమర్పణ చేయండి. 

వృశ్చికం: సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
పరిహారం: హనుమాన్ పూజ సంతోషాన్ని ఇస్తుంది. 

ధనుస్సు: ఇంటాబయటా ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. 
పరిహారం: విష్ణు పూజ మేలును కలుగ జేస్తుంది. 

మకరం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.
పరిహారం:  రాజ రాజేశ్వరి అష్టోత్తరం పారాయణం చేయండి. 

కుంభం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
పరిహారం: దుర్గా సప్త శ్లోకి పారాయణం చేయండి. 

మీనం: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆస్తివివాదాల పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.
పరిహారం:  గరికతో గణపతి పూజ చేయండి.