ఆగస్టు 12, 2020 బుధవారం దినఫలాలు

ఆగస్టు 12, 2020 బుధవారం దినఫలాలు

మేషం: పనులలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
పరిహారం: బగళాముఖి అమ్మవారిని పూజించండి. 

వృషభం: కొత్త విషయాలు గ్రహిస్తారు. నూతన ఉద్యోగలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
పరిహారం: రాజ రాజేశ్వరి అమ్మవారిని పూజించండి. 

మిథునం: శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.
పరిహారం: 16 రావి ఆకులు గురుగ్రహానికి సమర్పణ చేయండి. 

కర్కాటకం: సన్నిహితులు, మిత్రులతో కలహాలు, రుణయత్నాలు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు.
పరిహారం: నువ్వులు కలిపిన పాలతో శివభిషేకం. 

సింహం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప చికాకులు.
పరిహారం: అష్ట వినాయకుల స్తోత్రం పారాయణ చేయండి. 

కన్య: పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
పరిహారం: పసుపు, కుంకుమలతో గౌరీదేవిని పూజించండి. 

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. దైవదర్శనాలు.
పరిహారం: మహాలక్ష్గ్మి అమ్మవారిని దర్శనం చేసుకోండి. 

వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
పరిహారం: పేదవారికి ఆహార పదార్ధాలు దానం చేయండి. 

ధనుస్సు: ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. చర్చలు సఫలం. కుటుంబంలో శుభకార్యాలు. వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.
పరిహారం: ఉసిరిక చెట్టును నాటండి. 

మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.
పరిహారం: తెల్లని పుష్పాలతో పార్వతీ దేవిని పూజించండి. 

కుంభం: వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు వాయిదా. దూరప్రయాణాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
పరిహారం: ఆదిత్య హృదయం పారాయణ చేయండి. 

మీనం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
పరిహారం: శ్రీ రాజమతంగ్యై నమః అనే మంత్రం జపించండి.