ఆగస్టు 13, 2020 గురువారం దినఫలాలు

ఆగస్టు 13, 2020 గురువారం దినఫలాలు

మేషం: వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. వస్తు, ధనలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
పరిహారం: 11 పసుపు కొమ్ములను గౌరీ అమ్మవారికి సమర్పణ చేయండి. 

వృషభం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.
పరిహారం: దేవాలయం లో బొబ్బర్లు ఇవ్వండి. 

మిథునం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
పరిహారం: దత్తాత్రేయ స్వామిని శనగలతో చేసిన వంటకాలు నివేదన చేయండి. 

కర్కాటకం: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.
పరిహారం: శివునికి రుద్రాక్ష మాల సమర్పణ చేయండి. 

సింహం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.
పరిహారం: శనిపూజ నిర్వహించండి. 

కన్య: వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
పరిహారం: సుబ్రమణ్య స్వామి కవచం పారాయణ చేయండి. 

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
పరిహారం: దేవతలా అలంకరణకు పుష్పాలు సమర్పణ చేయండి. 

వృశ్చికం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.
పరిహారం: మహాలక్ష్మి అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పణ చేయండి. 

ధనుస్సు: మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.
పరిహారం: శ్రీ రామ జయ రామ జయ జయ రామ 

మకరం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో స్వల్ప సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
పరిహారం: పేదవారికి అన్నదానం చేయండి. 

కుంభం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.
పరిహారం: శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణ చేయండి. 

మీనం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
పరిహారం: విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.