ఆగస్టు 14, 2020 శుక్ర‌వారం దినఫలాలు

ఆగస్టు 14, 2020 శుక్ర‌వారం దినఫలాలు

మేషం: అప్రయత్న కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం.
పరిహారం: రాగి ప్రమిదలో 3 వత్తులతో దీపారాధన చేసి సుబ్రమణ్య స్వామిని సమర్పణ. 

వృషభం: ఇంటర్వ్యూలు అందుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల ద్వారా కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
పరిహారం: కమలాదేవిని పూజించండి. 

మిథునం: ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.
పరిహారం: దేవాలయం లో 5 కొబ్బెరబొండాలు అందించండి. 

కర్కాటకం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.
పరిహారం: అవాలతో శివాభిషేకం చేయండి. 

సింహం: వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
పరిహారం: దాశరధ కృత శని స్తోత్రం చేయండి. 

కన్య: రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
పరిహారం: ఇంటి ముందు ముగ్గులు వేసి ఇష్టదైవాన్ని సంస్కారం చేసుకోండి. 

తుల: బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. పనులలో తొందరపాటు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
పరిహారం: లక్ష్మీదేవిని గులాబీ పుష్పాలతో పూజించండి. 

వృశ్చికం: రాబడికి మించిన ఖర్చులు. వ్యయప్రయాసలు. మిత్రులు, బంధువులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు.
పరిహారం: పేదవారికి ఆహార పదార్ధాలను దానం చేయండి. 

ధనుస్సు: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో పురోగతి. కొన్ని వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగానే సాగుతాయి.
పరిహారం: చిన్నపిల్లలకు పాలు, పండ్లు దానం చేయండి. 

మకరం: కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
పరిహారం: దేవి ఖడ్గమాలా తో అర్చన చేయించండి. 

కుంభం: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
పరిహారం: లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. 

మీనం: కుటుంబంలో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
పరిహారం: సుదర్శన స్వామిని స్తోత్రం చేయండి.