ఆగస్టు 15, 2020 శ‌నివారం దినఫలాలు

ఆగస్టు 15, 2020 శ‌నివారం దినఫలాలు

మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. 
పరిహారం: దేవతా మండపంలో 5 వత్తులతో దీపారాధన చేయండి. 

వృషభం: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
పరిహారం: సాయంత్రం వేళలో కనకధారా స్తోత్రం పారాయణ చేయండి.  

మిథునం: వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం.
పరిహారం: తల్లిదండ్రులకు నూతన వస్త్రాలు ఇప్పించండి. 

కర్కాటకం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఉద్యోగయోగం. వ్యాపార వృద్ధి. 
పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి తో పూజించండి. 

సింహం: వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు. 
పరిహారం: దుర్గాదేవి ఆరాధన చేయండి. 

కన్య: నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం.
పరిహారం: పేదవారికి కనిపప్పును దానం చేయండి.  

తుల: రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
పరిహారం: మహాలక్ష్మి కి ప్రీతిగా తెల్లని వస్త్రాలు దేవాలయం లో సమర్పణ చేయండి.  

వృశ్చికం: బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇంటాబయటా మీదే పైచేయి. సంఘంలో గౌరవం. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 
పరిహారం: ఎర్రని అక్షతలతో దిష్టి తీసుకోండి. 

ధనుస్సు: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వస్త్రలాభాలు. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
పరిహారం: పంచామృతాలతో విష్ణు పూజ చేయండి. 

మకరం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. 
పరిహారం: తెల్లని వస్తువులు దానం చేయండి.