ఆగస్టు 18, 2020 మంగళవారం దినఫలాలు

ఆగస్టు 18, 2020 మంగళవారం దినఫలాలు

మేషం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
పరిహారం: గణపతికి సింధూరం సమర్పణ చేయండి. 

వృషభం: పనుల్లో ఊహించని విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
పరిహారం: దేవాలయం లో సుగంధ ద్రవ్యాలను అర్చనకు అందించండి. 

మిథునం: ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.
పరిహారం: ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం పారాయణ  చేయండి. 

కర్కాటకం:  రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
పరిహారం: మారేడు చెట్టును నాటండి. 

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. విచిత్రమైన సంఘటనలు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
పరిహారం: శని స్తోత్రాలు పారాయణ చేయండి. 

కన్య: వ్యయప్రయాసలు తప్పవు. ధనవ్యయం. కుటుంబంలో కొన్ని వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
పరిహారం: సుబ్రమణ్య స్వామి భుజంగ స్తోత్రం చదవండి. 

తుల: మిత్రులతో సఖ్యత. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు సాయం అందిస్తారు. వ్యాపారాలు మరింత కలసివస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
పరిహారం: పేదవారికి తెల్లని వస్త్రాలు దానం చేయండి. 

వృశ్చికం: దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
పరిహారం: అష్టలక్ష్మి ని పూజించండి. 

ధనుస్సు: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో మరింత  గౌరవం. కీలక నిర్ణయాలు. నూతన ఉద్యోగప్రాప్తి. భూ, గృహయోగాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి.
పరిహారం: షోడషీ అమ్మవారిని పూజించండి. 

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
పరిహారం: ముత్యాల హారమును ధరించి స్నానం చేయండి. 

కుంభం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్పదు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
పరిహారం: దేవాలయం లో గోధుమలు, బెల్లము దానం చేయండి. 

మీనం: కొత్త రుణాలు చేస్తారు. పనులలో ఆటంకాలు. ఎంతగా కష్టపడ్డా ఫలితం ఉండదు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
పరిహారం: సింధూరం తో గణపతిని పూజించాలి.