ఆగస్టు 4, 2020 మంగ‌ళ‌వారం దినఫలాలు

ఆగస్టు 4, 2020 మంగ‌ళ‌వారం దినఫలాలు

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. పేద చేనేత కార్మికులకు సహాయం చేయండి. 

వృషభం: విచిత్ర సంఘటనలు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. రావి చెట్టుకు 16 వరుసలు పసుపు దారం చుట్టి 16 ప్రదక్షిణలు చేయాలి. 

మిథునం: కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆదరణ లభిస్తుంది. నూతన ఒప్పందాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. తేనెతో వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయండి. 

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభ సూచనలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. రొట్టె ముక్కలను వీధి కుక్కలకు ఆహారంగా వేయండి. 

సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు. గురు గ్రహ అర్చన చేయండి. 

కన్య: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దేవాలయం లో జవ్వాది కస్తూరి ఇవ్వండి. 

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. ఏనుగుతో కూడుకుని వున్న మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేయండి. 

వృశ్చికం: కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అనుకోని ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి గందరగోళం. గణపతి కి లడ్డూలు నివేదన చేయండి.

ధనుస్సు: శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. శివ పంచాక్షరీ జపం చేయండి.

మకరం:  వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ఏ పని చేపట్టినా విజయమే. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించండి

మీనం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. సోదరులు, సోదరీలతో సఖ్యత. విందువినోదాలు. నూతన ఉద్యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. మహాలక్ష్మీకి  గోధుమ నూక తో తయారు చేసిన పాయసం నివేదనం చేయండి.