జులై 30, 2020 గురు‌‌వారం దినఫలాలు

జులై 30, 2020 గురు‌‌వారం దినఫలాలు

మేషం: వ్యయప్రయాసలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్థిరాస్తి వృద్ధి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిథునం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాలి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యస్థితి.

కర్కాటకం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. పనులు సజావుగా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

సింహం:  వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

కన్య: కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం.

తుల: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

వృశ్చికం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు.

దనుస్సు: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

మకరం: సన్నిహితులో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

కుంభం: మిత్రులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. పనుల్లో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.