14 జనవరి 2019 సోమవారం మీ రాశిఫలాలు

14 జనవరి 2019 సోమవారం మీ రాశిఫలాలు

మేషం
నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఓపిక అవసరం. తొందరపాటు పనికి రాదు. బద్ధకంగా ఉంటుంది, పనులు వాయిదా వేసి విశ్రాంతి కోరుకుంటారు.

వృషభం
ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్రులను కలుస్తారు.

మిథునం
చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి, వాయిదా వేస్తున్న పనులు పూర్తి చేయటానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం
పెట్టుబడులలో అజాగ్రత్త, తొందరపాటు పనికి రాదు. మీ తొందరపాటు వలన డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. అలాగే మీ శత్రువుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. 

సింహం
ఉద్యోగంలో కొంత అనుకూలత ఉంటుంది. సహోద్యోగుల సహాయం తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.శ్వాస, జీర్ణసంబంధ అనారోగ్యం బారిన పడే అవకాశముంటుంది. 

కన్య
కొద్దికాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఒక కొలిక్కి వస్తుంది. వాయిదా పడిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. 

తుల
వృత్తి పరంగా ఒక శుభవార్త వింటారు. రోజంతా ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సహాయం లభిస్తుంది. కొద్దికాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్య తగ్గుముఖం పడుతుంది. 

వృశ్చికం
డబ్బు విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. అనుకోని అవమానం, మానసిక ఆందోళన ఎదురుకావచ్చు. ఇతరుల విషయాల్లో కల్పించుకోకండి. 

ధనుస్సు
మీ శక్తిపై నమ్మకముంచి ముందడుగేయండి, విజయం మీ సొంతమవుతుంది. అనుమానంతో ఏ పని చేయకండి. దూరప్రయాణం చేసే అవకాశముంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వృత్తిలో మార్పు కానీ, అభివృద్ధి కానీ ఉంటుంది. చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది. 

కుంభం
మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఈ రోజు ఆరోగ్యం విషయంలో సాధారణంగా ఉంటుంది. నేత్ర సంబంధ అనారోగ్యం కానీ, మానసిక ఆందోళన కానీ ఉంటుంది.

మీనం
పాత బకాయిలు వసూలు కావటం కానీ, అనుకోని ఆదాయం రావడం కానీ జరుగుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు కూడా అనుకూల దినం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అలాగే చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.