నూబియా జడ్18 స్మార్ట్‌ఫోన్ విడుదల

నూబియా జడ్18 స్మార్ట్‌ఫోన్ విడుదల

జడ్‌టీఈ తన అనుబంధ సంస్థ నూబియా నుండి 'నూబియా జడ్18' స్మార్ట్‌ఫోన్ ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. సెప్టెంబర్ 11 నుండి చైనాలో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభవమనున్నాయి. త్వరలో ఇండియాలోనూ ఈ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. నూబియా జడ్18 మినీని గత ఏప్రిల్ లో విడుదల చేసింది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ గల జడ్18 ఫోన్ రూ.29,350 లకు.. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ గల ఫోన్ రూ.34,600 లకు వినియోగదారులకు లభించనుంది. మూడు కలర్ లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.

ఫీచర్లు:

# 5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
# గొరిల్లా గ్లాస్
# 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 
# 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 
# 845 ప్రాసెసర్
# ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
# 6/8 జీబీ ర్యామ్.. 64/128 జీబీ స్టోరేజ్
# 16+24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
# 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
# ఫింగర్ ప్రింట్ సెన్సార్
# 4జీ వీవోఎల్‌టీఈ
# 3450 ఎంఏహెచ్ బ్యాటరీ