సినిమాల్లో అంకెలగారడీ..!!

సినిమాల్లో అంకెలగారడీ..!!

సినిమా టైటిల్స్ విషయంలో కొత్తగా, క్యాచీగా ఉంచేందుకు దర్శక నిర్మాతలు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. రియాలిటీకి దూరంగా, కల్పనగా ఉండేది సినిమా.  ఇప్పుడు దర్శక నిర్మాతల దృష్టికోణం చాలావరకు మారింది.  రియాలిటీ సన్నివేశాలను కొన్నింటినితీసుకొని ..  వాటి చుట్టూ కల్పనను జోడించి సినిమాగా తీస్తున్నారు.  ఇలాంటి సినిమాలు ఇప్పుడు హిట్ అవుతున్నాయి.  

 కథల విషయంలో కొత్తగా ఎలా ఆలోచిస్తారో... టైటిల్స్ విషయంలోనూ కొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.  సినిమా టైటిల్స్ లో అంకెలు ఉండే విధంగా చూసుకుంటున్నారు.  ఉదాహరణకు రంగస్థలం 1985. 1985 ప్రాంతంలో కోనసీమలో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకొని సినిమా చేశారు.  రామ్ చరణ్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్టైంది.  ఇప్పుడు రాం చరణ్ హీరోగా 118 అనే సినిమా తెరకెక్కుతున్నది.  సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఇటీవలే రిలీజైన టీజర్ ఆకట్టుకుంది. 

ఇదే కోవలో ఇప్పుడు బాహుబలి ప్రభాస్ సినిమా కూడా రాబోతున్నది.  1960 ప్రాంతంలో జరిగిన కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమా టైటిల్ వివరాలను యూనిట్ ప్రకటించలేదు.  కథకు అనుగుణంగా 1960 ను జోడించి టైటిల్ పెడతారని ప్రచారం జరుగుతున్నది.  అంకెలతో పెట్టిన సినిమాలు హిట్ అవుతుండటంతో ఇప్పుడు అందరి చూపులు అంకెలవైపు ఉన్నాయి.  అప్పట్లో గూఢచారి 116, గూఢచారి 117 వంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.