పోలీసులను ఆశ్రయించిన ఎంపీ నుస్రత్ జహాన్..!

పోలీసులను ఆశ్రయించిన ఎంపీ నుస్రత్ జహాన్..!

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ,నటి నుస్రత్ జహాన్ రుహి తన అనుమతి లేకుండా తన ఫోటోను ఉపయోగించిన వీడియో చాట్ యాప్ పై కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ ప్రమోషన్ కోసం ఆమె ఫోటోను ఉపయోగించడాన్ని ఆమె తప్పు పట్టింది. వీడియో చాట్ యాప్ మేనేజ్‌మెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది. ఈ మేరకు నుస్రత్ జహాన్ రుహి తన ట్విట్టర్ ఖాతాలో స్క్రీన్ షాట్‌ను కూడా పంచుకున్నారు. పోలీస్ కమిషనర్ అనుప్ శర్మను కూడా ఈ పోస్ట్ లో ఆమె ట్యాగ్ చేసింది. దీనిపై స్పందించిన పోలీసు కమిషనర్ వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఇప్పటికే నుస్రత్ ఫిర్యాదు మేరకు సైబర్ సెల్ దర్యాప్తును ప్రారంభించింది.