ఏపీ క్వారంటైన్ లో న్యూట్రిషన్ ఫుడ్...గుడ్లు, భాదం ఇంకా..!

ఏపీ క్వారంటైన్ లో న్యూట్రిషన్ ఫుడ్...గుడ్లు, భాదం ఇంకా..!

ఏపీలో విదేశాల నుండి వచ్చినవారిని , మర్కజ్ నుండి వచ్చిన వారిని ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ క్వారంటైన్ కేంద్రాలున్నాయి. అయితే అక్కడ వారికీ ఎలాంటి ఆహారం పెడుతున్నారో ప్రభుత్వం వెల్లడించింది.  క్వారంటైన్ లో ఉన్నవారికి ప్రభుత్వం ప్రత్యేకమైన డైట్ ను అందజేస్తుంది. వారికి ఇచ్చే ఆహారంలో కోడిగుడ్లు, బాదంపప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం అందజేస్తున్నారు. న్యూట్రిషన్ ఫుడ్ తినడం  వల్ల వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనే భావనతోనే ప్రభుత్వం ఇలాంటి ఆహారాన్ని అందిస్తోంది. ఇదివరకు కేరళ ప్రభుత్వం కూడా ఇలాగే క్వారంటైన్ లో ఉన్నవారికి పెడుతున్న మెనూ ను విడుదల చేసింది.