ఓ బేబీ టీజర్ ఎలా ఉండబోతుంది

ఓ బేబీ టీజర్ ఎలా ఉండబోతుంది

సమంత మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న సినిమా ఓ బేబీ.  కొరియన్ సినిమా మిస్ గ్రానీ సినిమాకు రీమేక్ ఇది.  సమంత ఇందులో 70 సంవత్సరాల యువతిగా కనిపిస్తున్నారు.  20 సంవత్సరాల వయసున్న యువతి శరీరంలోకి 70 సంవత్సరాల వయసున్న మహిళ ఆత్మ ప్రవేశిస్తే ఎలా ఉంటుంది.  ఆ తరువాత ఆమె జీవితంలో జరిగిన పరిణామాలు ఏంటి అన్నది మిగతా కథ.  

ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు ఓ బేబీ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు.  ఈ విషయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.  మరి ఈ టీజర్ ఎలా ఉంటుందో తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.