సమంతతో ఎంజాయిమెంట్ మాములుగా ఉండదట

సమంతతో  ఎంజాయిమెంట్  మాములుగా ఉండదట

సమంత మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ఓ బేబీ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  లక్ష్మి తన జ్ఞాపకాలను తలుచుకుంటూ టీజర్ ను ఓపెన్ చేశారు.  ఇంతలో ఆ బామ్మ 20 ఏళ్ల సమంతలా మారిపోతుంది. సమంత రూపంలో ఉన్న బామ్మ తన జ్ఞాపకాలను నాగశౌర్యతో పంచుకుంటూ ఉంటుంది.  చిన్న వయసులో ఉండగానే పెళ్లయింది.  వయసు వచ్చే సరికి ఇద్దరు పుట్టేశారు.  వాళ్ళను పెంచి పెద్ద చేసే సరికి నావయసు అయ్యిపోయింది.  నేను ఎంజాయ్ చేయలేకపోయాను అని సమంత చెప్పగానే నాగశౌర్య షాక్ అవుతాడు.  

టీజర్ చివర్లో నాతొ ఎంజాయ్ మెంట్ మాములుగా ఉండదు... ఒక్కొక్కరికి అనే డైలాగ్ అదిరిపోయింది.  పూర్తిస్థాయిలో ఫన్ టు ఫన్ గా సినిమాను తెరకెక్కించారని స్పష్టం అవుతున్నది.  కొరియా సినిమా మిస్ గ్రానీకి ఇది రీమేక్.  నందిని రెడ్డి తెరక్కించిన ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.