హెలికాప్టర్‌ను ఎందుకు అద్దెకు తీసుకున్నారు?

హెలికాప్టర్‌ను ఎందుకు అద్దెకు తీసుకున్నారు?

'మీరు ప్రత్యేక హెలికాప్టర్‌ను, చార్టెర్డ్‌ జెట్‌ను ఎందుకు అద్దెకు తీసుకున్నారు? కారణాలేంటి? అన్ని అనుమతులొచ్చాకే తీసుకున్నారా? పూర్తి వివరాలు పంపించగలరా?' అంటూ ఒడిశా గవర్నర్‌కు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ లేఖ పంపించింది. ఇటీవల ఢిల్లీ, సిర్సా పర్యటనలకు గవర్నర్‌ లాల్‌ వెళ్లారు. ఢిల్లీ పర్యటనకు రూ.41.18 లక్షల అద్దెతో ఓ జెట్‌, సిర్సా పర్యటనకు రూ.5 లక్షల అద్దెతో ఓ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నారు. ఈక్రమంలో పర్యటన ప్రయాణ ఖర్చుల వివరాల అందించాల్సిందిగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆదేశాలతో సాధారణ పరిపాలన శాఖ.. గవర్నర్‌ కార్యాలయానికి ఓ లేఖ రాసింది. గవర్నర్‌ పర్యటన ఖర్చులపై ముఖ్యమంత్రి వివరాలు కోరడం సంచలనంగా మారింది.