బంగారం లాంటి ఆఫ‌ర్.. 25 శాతం త‌క్కువ ధ‌ర‌కే ప‌సిడి..!

బంగారం లాంటి ఆఫ‌ర్.. 25 శాతం త‌క్కువ ధ‌ర‌కే ప‌సిడి..!

వ‌రుస‌గా త‌గ్గుతూ వ‌చ్చిన ప‌సిడి ధ‌ర‌లు.. ఇప్పుడు మ‌ళ్లీ క్ర‌మంగా పైకి క‌దులుతున్నాయి.. అప్ప‌డ‌ప్పుడు కాస్త త‌గ్గినా.. ఈ మ‌ధ్య మాత్రం ఎగ‌బాకుతూనే ఉంది.. ఇంత కాలం ధ‌ర ఇంకా త‌గ్గుతుందేమోన‌ని ఎదురుచూసిన ప‌సిడి ప్రేమికుల‌కు వ‌రుస‌గా ధ‌ర‌ల పెరుగుద‌ల షాక్ ఇస్తోంది. ఈ త‌రుణంలో ఉగాది పండుగ స‌మ‌యంలో బంగారం లాంటి ఆఫ‌ర్ తెచ్చింది ప్రముఖ జువెలరీ సంస్థ తనిష్క్.. 

త‌న సంస్థ‌లో బంగారం కొనేవారి కోసం ఓ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది త‌నిష్క్.. గోల్డ్ జువెలరీ తయారీ చార్జీల్లో 25 శాతం వరకు తగ్గింపు అందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.. ఈ ఆఫ‌ర్ కేవలం బంగారు నగలకు మాత్రమే కాకుండా డైమండ్ జువెలరీకి కూడా వ‌ర్తించ‌నుంది. అయితే, ఉగాది సంద‌ర్భంగా తెచ్చిన ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుంది అనేదానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. తనిష్క్ తో పాటు మరో ప్రముఖ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా ఓ ఆఫ‌ర్ తెచ్చింది.. డైమండ్ జువెలరీపై 25 శాతం వరకు తగ్గింపు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. మ‌రోవైపు.. ఇవాళ బులియెన్ మార్కెట్ ప‌సిడి ధ‌ర‌లు కాస్త పైకి క‌దిలిన సంగ‌తి తెలిసిందే.