నాగ్ కెరీర్ లో దారుణమైన ఓపెనింగ్స్!

నాగ్ కెరీర్ లో దారుణమైన ఓపెనింగ్స్!

నాగార్జున నటించిన 'ఆఫీసర్' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందరూ అనుకున్నట్లుగానే సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. సినిమాపై నమ్మకం లేనప్పటికీ నాగార్జున ఓపెనింగ్స్ కోసం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బాగానే పాల్గొన్నాడు. కానీ నాగ్ కష్టం వృధా అయిందనే చెప్పాలి. తొలిరోజు ఈ సినిమా నైజాంలో రూ.9 లక్షలు.. ఉత్తరాంధ్రలో రూ.6.5 లక్షలు, గుంటూరులో రూ.4 లక్షలు.. ఈస్ట్ వెస్ట్ కలిపి రూ.8 లక్షలు, కృష్ణాలో రూ.8 లక్షలు, నెల్లూరులో రెండున్నర లక్షలు మాత్రమే వసూలు చేసింది. మొత్తం రూ.45 లక్షలు ఓపెనింగ్స్ రాబట్టాయి. ఇప్పటివరకు నాగార్జున కెరీర్ లో ఇంత దారుణమైన ఓపెనింగ్స్ రాలేదు. వర్మపై నమ్మకం పెట్టుకొని నటించిన నాగార్జునకు మాత్రం నిరాశే మిగిలింది. సినిమాకు అన్ని చోట్ల నుండి నెగెటివ్ టాక్ రావడంతో వీకెండ్ లో కూడా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు అవకాశాలు కనిపించడం లేదు.