ఆఫీసర్ రావట్లేదు 

ఆఫీసర్ రావట్లేదు 

రామ్ గోపాల్ వర్మ, అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం "ఆఫీసర్". ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతోంది. తాజాగానే సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. ఈ సినిమాలో నాగార్జున..పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా..రెగ్యులర్ చిత్రాలకు బిన్నంగా వర్మ ఈ చిత్రాన్ని రూపొందించాడట. మొదటగా ఈ సినిమాని మే 25 రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అలాగే మిగిలుండడంతో ఈ సినిమా ను జూన్ 1కి వాయిదా వేశారు. ఇదే విషయాన్నీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ సినిమాలో మైరా సరీన్ హీరోయిన్ గా నటించగా, కంపెనీ బ్యానర్ పై వర్మ నిర్మించడం విశేషం.