ఏపీలో మొత్తం ఒకేసారి ఇళ్ల పట్టాల పంపిణీ.. అధికారుల కసరత్తు..!

ఏపీలో మొత్తం ఒకేసారి ఇళ్ల పట్టాల పంపిణీ.. అధికారుల కసరత్తు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది... మరోసారి ఇళ్ల పట్టాల పంపిణీ కోసం కసరత్తు చేస్తున్నారు అధికారులు.. వచ్చే నెల రెండో తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కోర్టులో కేసులున్నందున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు అధికారులు.. భూముల విషయంలో కోర్టు కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయోననే అంశంపై వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ఇప్పటికే రాజధాని అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీపై కోర్టు స్టే ఇచ్చింది.. ఆవ భూముల్లో ఇళ్ల పట్టాల పంపిణీని రద్దు చేసింది కోర్టు.. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీని ఒకేసారి చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.. రకరకాల ఇబ్బందులతో ఇళ్ల పట్టాల పంపిణీకి ఆటంకాలు వస్తున్నాయని భావిస్తోన్న సర్కార్.. కొన్ని ప్రాంతాల్లో ఇచ్చి.. మరికొన్ని ప్రాంతాల్లో నిలుపుదల చేయడం సరికాదనే భావనలో ఉంది. ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో కొన్ని రోజులు ఆగుదామనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహణ విషయంలో ఆదేశాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.