అదే రోజున ప్రభాస్ పెళ్లి ప్రకటన !

అదే రోజున ప్రభాస్ పెళ్లి ప్రకటన !

టాలీవుడ్లో ఎప్పుడూ నడిచే హాట్ టాపిక్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం.  ఇప్పటికే అనేకసార్లు తెరమీదికొచ్చిన ఈ అంశం అభిమానులు, మీడియా సర్కిల్స్ లో ఎప్పుడూ కొత్తగానే నడుస్తూ ఉంటుంది.  ఇప్పుడు కూడ ఈ విషయమై కొత్త వార్తొకటి తెగ హల్ చల్ చేస్తోంది. 

ప్రస్తుతం ప్రభాస్ వయసు 38 సంవత్సరాలు కాగా వచ్చే నెల 23న ఆయన 39వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోనున్నారు.  అదే రోజున ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ప్రభాస్ పెళ్లి విషయాన్ని అనౌన్స్ చేస్తారట.  అంటే వివాహమెప్పుడు, పెళ్లి కుమార్తె ఎవరు అనే విషయాలన్నమాట.  వార్తల సంగతి పక్కనబెడితే ఇంకో ఏడాది గడిచిందంటే ప్రభాస్ కు 40 ఏళ్ళు వచ్చేస్తాయి.  కాబట్టి ఈ 39వ ఏటనే అయన పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ డైరెక్షన్లో 'సాహో' అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు.