అఫీషియల్: రామ్ తో కృతి శెట్టి

అఫీషియల్: రామ్ తో కృతి శెట్టి

తొలి చిత్రం 'ఉప్పెన'తో సెన్సేషనల్ హిట్ కొట్టిన హీరోయిన్ కృతిశెట్టి మంచి జోరుమీదుంది. టాలీవుడ్ లో హాట్ కేక్ లా వరుస ప్రాజెక్ట్ లు కమిట్ అవుతోంది. ఇప్పటికే పారితోషికాన్ని కోటికి పెంచిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కృతి జోడీ కట్టనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై లింగుస్వామి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న సినిమాలో కృతినే కథానాయికగా ఎంపిక చేసినట్లు నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటించారు. పవన్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా రామ్ పోతినేని 19వ సినిమాగా రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుండటం విశేషం. రామ్ కెరీర్ లోనే హై బడ్జెట్ తో తెరకెక్కనున్న చిత్రమిది.