రివ్యూ: ఓ బేబీ

రివ్యూ: ఓ బేబీ

నటీనటులు: సమంత, లక్ష్మి, నాగసౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, ప్రగతి తదితరులు 

మ్యూజిక్: మిక్కీ జే మేయర్ 

ఫోటోగ్రఫి: రిచర్డ్ ప్రసాద్ 

నిర్మాత: సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా 

దర్శకత్వం: నందిని రెడ్డి 

సమంత హీరోయిన్ గా చేసిన ఓ బేబీ మూవీ ఈరోజు రిలీజ్ అయ్యింది.  కొరియన్ మూవీ మిస్ గ్రానీకి ఇది రీమేక్.  ఈ సినిమాపై అనేక అంచనాలు ఉన్నాయి.  అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉన్నదా లేదా తెలుసుకుందాం. 

కథ

లక్ష్మి చిన్నవయసులోనే పెళ్లి జరుగుతుంది.  యుక్తవయసులోకి రాగానే భర్తను కోల్పోతుంది.  పెద్దవయసు వచ్చాక తన పిల్లలు, మనవళ్లతో కలిసి ఉంటుంది.  కానీ, తన పెద్దవయసు ప్రవర్తన వలన, అతి ప్రేమ వలన ఆమెను అక్కడ ఉంచితే పిల్లలు కూడా అలాగే మారిపోతారేమో అనుకోని ఆమెను తీసుకెళ్లి ఓ వృద్దాశ్రమంలో ఉంచుతారు.  దీంతో ఆమెలో ఆమె మదనపడుతుంది.  అదే సమయంలో తనకు తెలియకుండా వయసు తగ్గిపోతుంది.  యుక్తవయసులో ఉంటె ఎలా ఉండాలని అనుకుందో ఆ కలను నిజం చేసుకునే రోజు వస్తుంది.  అసలు పెద్దవయసులో ఉన్న లక్ష్మి.. యుక్తవయసులో ఉన్న సమంతగా ఎలా మారింది..? తన కలలు ఏంటి..? వాటిని ఎలా నెరవేర్చుకుంది అన్నది మిగతా సినిమా.  

విశ్లేషణ: 

మిస్ గ్రానీ చూసిన వాళ్లకు ఈ మూవీ కథ ను గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  కొరియన్ మూలాలున్న.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దీనిని మార్చేశారు.  పక్కా ఎంటర్టైనర్ గా సినిమాను తీర్చిదిద్దారు.  వయసు చేతిలో ఉండగా ఏదో చేయాలని అనుకుంటాం.  అలా ఆలోచిస్తూ ఉండగానే..వయసైపోతుంది.  అయ్యో అప్పుడు ఏం చేయలేకపోయామే అని బాధపడిపోతుంటారు.  అలాంటి వాళ్లకు తిరిగి వయసు తగ్గిపోతే.. లైఫ్ లో ఎలా ఉంటారు.  అన్నది కాన్సెప్ట్.  నందిని రెడ్డి ఈ కాన్సెప్ట్ ను చక్కగా మలిచారు.  ఫస్ట్ హాఫ్ పక్కా ఎంటర్టైనర్ గా సాగిపోతుంది. బేబీగా లక్ష్మి, సమంతలు పోటీ పడి నటించారు.  ఎక్కడా బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ ఉండటం విశేషం. అక్కడక్కడా సెంటిమెంట్ ను పెడుతూ.. ఆ వెంటనే కామెడీని మిక్స్ చేస్తూ నడిపించారు.  

సెకండ్ హాఫ్ లో ఇదే గ్రిప్పింగ్ కొనసాగింది.  అయితే, సెకండ్ హాఫ్ కామెడీ పాళ్ళు కొద్దిగా తక్కువగా ఉంది.. ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి.  ముఖ్యంగా క్లైమాక్స్.  క్లైమాక్స్ ను డీల్ చేసిన విధానం అందరికి నచ్చుతుంది. 

నటీనటుల పనితీరు: 

ఒక్కరు అని కాదు అందరూ పోటీపడి నటించారు. ముఖ్యంగా సమంత తన నటనతో ఆకట్టుకుంది.  కామెడీ, ఎమోషన్స్ అన్నింటిని అద్భుతంగా పలికించింది.  లక్ష్మి సైతం సమంతతో పోటీ పడింది.  రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ల నటనకు కు పేరు పెట్టాల్సిన అవసరం లేదు.  జగపతిబాబు కీ రోల్ పోషించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

సినిమాను నందిని రెడ్డి డీల్ చేసిన విధానం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నందిని రెడ్డి సినిమాలంటే కలర్ ఫుల్ గా ఉంటాయి.  ఈ మూవీ కూడా అలాగే ఉన్నది.  గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నందిని ఆకట్టుకుంది.  ప్రతి ఫ్రేమ్ ను రిచ్ గా ప్రజెంట్ చేసేందుకు చాలా కష్టపడింది.  రిచర్డ్ ప్రసాద్ కెమెరాపనితం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.  మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.  సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.  

ప్లస్ పాయింట్స్: 

నటీనటులు 

స్టోరీ, స్క్రీన్ ప్లే 

మైనస్ పాయింట్స్: 

సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా సాగతీత 

చివరిగా: ఓ బేబీ - ఓ రోలర్ కోస్టర్