చైనాలో రిలీజ్‌కు 'ఓ బేబీ' రెడీ..!

చైనాలో రిలీజ్‌కు 'ఓ బేబీ' రెడీ..!

స‌మంత అక్కినేని ప్రధాన పాత్రలో న‌టించిన "ఓ బేబీ" సినిమా బాక్సాఫీస్ ద‌గ్గర సత్తా చాటుతోంది... జులై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రశంసలతో పాటు పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా యూఎస్‌లో ఓ బేబీ.. 10 రోజుల్లో వన్ మిలియన్ వసూళ్లకు చేరువలో ఉందంటున్నారు సినీ పండితులు. సమంతా అక్కినేని, దర్శకురాలు నందిని రెడ్డి కాంబోలో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఉండడంతో మరో అడుగు ముందుకేసి చైనా అంతటా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. త్వరలోనే చైనాలో ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేస్తామని వెల్లడించారు ఓ! బేబీ సహ నిర్మాతలు వివేక్ కుచిభోట్ల, సునీతా తాతి. ఇక, ఈ సినిమాను డబ్ చేయడానికి కూడా భారీ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. బెంగాలీ మరియు కన్నడతో పాటు ఇతర భారతీయ భాషల్లో డబ్ చేసేందుకు పంపిణీదారుల నుంచి తీవ్రమైన పోటీ ఉందంటున్నారు.