దుమ్ము రేపుతున్న బన్నీ ఓమైడాడి సాంగ్ 

దుమ్ము రేపుతున్న బన్నీ ఓమైడాడి సాంగ్ 

అల్లు అర్జున్ హీరోగా  తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురంలో.. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  బాలల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని మూడో సింగ్ ఓ మై డాడి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో సాంగ్ లో అల్లు అర్జున్ ఇద్దరు పిల్లలపై షూట్ చేశారు.  వాళ్ళ మూమెంట్స్ ను కవర్ చేస్తూ.. బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ ను పెట్టారు.  

మొదటిసారిగా అల్లు అర్జున్ పిల్లలు ఇద్దరు సినిమా సాంగ్ లో కనిపించడం విశేషం.  ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఇప్పటికే రిలీజ్ చేసుకున్న రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.  మూడో సాంగ్ ప్రోమో కూడా అదే విధంగా దూసుకుపోతుంది అనడంలో సందేహం అవసరం లేదు.