‘ఒక్కడు’ సీక్వెల్‌పై ఫోకస్‌..?

‘ఒక్కడు’ సీక్వెల్‌పై ఫోకస్‌..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, భూమిక జంటగా తెరకెక్కిన ‘ఒక్కడు’ సినిమా అప్పట్లో ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఎంఎస్ రాజు నిర్మాణంలో గుణశేఖ‌ర్ డైరెక్షన్‌లో వ‌చ్చిన ఈ చిత్రం ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది.

అయితే ‘ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ రాబోతోందంటూ ఎప్పటి నుంచో గాసిప్స్ వస్తున్నా నిర్మాత ఎం.ఎస్.రాజు సరైన అప్‌డేట్స్ ఇవ్వకపోవడం మహేశ్‌ ఫ్యాన్స్ లైట్ తీసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు వారందరికీ అదిరిపోయే వార్త చెప్పబోతున్నాడట ఎం.ఎస్.రాజు. 

ఆయన దర్శకత్వం వహించిన ‘డర్టీ హరి’ రిలీజ్ తర్వాత ‘ఒక్కడు’ సీక్వెల్‌పై ఫోకస్ చేయనున్నాడట. ఒక్క‌డు చిత్రానికి సీక్వెల్ చేసేందుకు ఎంఎస్ రాజు ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. అయితే ఈ సినిమాకు ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది సస్పెన్స్‌గా మారింది. 

మ‌హేష్ బాబు ఇప్ప‌టికే సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉండ‌గా.. ప‌లువురు డైరెక్ట‌ర్ల సినిమాల‌ను లైన్ లో పెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో మహేష్ ‘ఒక్కడు’ సీక్వెల్ పై దృష్టిసారించే అవకాశం తక్కువే. ఇక ఎంఎస్ రాజు డైరెక్ట‌ర్ గా ‘డ‌ర్టీ హ‌రి’ చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 18న విడుద‌ల కానుంది.