మారణాయుధాలతో వచ్చిన దొంగలను తరిమికొట్టిన వృద్ద దంపతులు...

మారణాయుధాలతో వచ్చిన దొంగలను తరిమికొట్టిన వృద్ద దంపతులు...

సాధారణంగా ఇళ్ళ మీదకి దొంగతనానికి మారణాయుధాలతో వస్తే ఏమి చేస్తారు, ముందు అరుస్తారరు, అక్కడ అరిచినా ఉపయోగం లేదనుకుంటే ఏమి చేస్తారు తమ దగ్గరున్న డబ్బూ, దస్కం ఇచ్చేసి ఊరుకుంటారు. కానీ తమిళనాడుకు చెందిన ఒక వృద్ద జంట దోపిడీకి వచ్చిన దొంగను తరిమి కొట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. వారు అలా తరిమి కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముసుగు వేసుకున్న ఇద్దరు దొంగలు తిరునల్వేలి జిల్లాలోని కడయం కల్యాణిపురంలోని షణ్ముగవేల్ ఇంట్లోకి ప్రవేశించి వెనుక నుంచి నెమ్మదిగా వచ్చి ఓ ఆగంతకుడు వృద్ధుడి మెడలో టవల్‌ వేసి స్తంభానికి కట్టే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే వృద్ధుడి భార్య బయటకు వచ్చింది. చేతిలో ఏది ఉంటే అది విసిరి కొట్టడం మొదలు పెట్టింది. దీంతో ఆ దొంగ కాస్త తడబడ్డాడు, వృద్ధుడు తన మెడకు కట్టిన టవల్‌ నుంచి విడిపించుకొని తమ వద్ద ఉన్న కుర్చీలతో ఆగంతకులపై ఎదురుదాడికి దిగారు. ఆగంతకులు కత్తులతో బెదిరించినా ఏమాత్రం భయపడకుండా కుర్చీలతో ప్రతిఘటించి వారిని తరిమి తరిమి కొట్టారు. దీంతో ఆగంతకులు పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వృద్ధ దంపతుల సాహసాన్ని చూసిన తెలిసిన ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.