92 ఏళ్ళ తల్లి... కొడుకునే కాల్చేసింది...

92 ఏళ్ళ తల్లి... కొడుకునే కాల్చేసింది...

కని పెంచిన ఆ తల్లిని కనికరం లేకుండా వృద్ధాశ్రమానికి పంపాలని ప్లాన్ చేశాడు ఆ కుమారుడు. అంతే అతని ప్లాన్ తెలుసుకున్న ఆ 92 ఏళ్ల తల్లి కొడుకు అని కూడా చూడకుండా కాల్చి పడేసింది.  అమెరికాలోని అరిజోనాలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది.  అన్నా మే బ్లెసింగ్ కు 92 ఏళ్లు. ఆమె కుమారుడు తల్లిని కేర్ హోంలో ఉంచాలని ప్లాన్ చేశాడు. ఆ సంగతి తెలుసుకున్న ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. తర్వాత కుమారున్ని హత్య చేసింది. ఆమె కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆమెను కాపాడారు. తల్లితో కలిసి ఉండడం కష్టంగా అనిపించడంతో అతడు ఆమెను అన్ని సౌకర్యాలూ ఉన్న ఒక కేర్ సెంటర్‌లో వదిలిపెట్టాలని అనుకున్నాడు. దీంతో ఆమె కుమారుడి గొడవపడింది. మాటామాటా పెరగడంతో తన వెంట తెచ్చుకున్న రివాల్వర్ అతడిని కాల్చివేసింది. మెడ, దవడలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లడంతో అతడు చనిపోయాడు.  

కుమారుడిని హత్య చేసిన తర్వాత ఆమె కుమారుడి గర్ల్ ఫ్రెండ్ ని సైతం కాల్చివేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆమె బ్లెసింగ్‌తో పెనుగులాడి తప్పించుకున్నారు.  బ్లెసింగ్ తన కుమారుడు, అతడి స్నేహితురాలితో కలిసి ఆరిజోనాలో ఒక ఇంట్లో ఉంటున్నారు. హత్య తర్వాత బ్లెసింగ్ తన గదిలో ఒక వాలు కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.  హత్య, దాడి, కేసులు నమోదు చేశారు. బ్లెసింగ్‌కు 5 లక్షల డాలర్ల పూచీకత్తుపై బెయిలు మంజూరు చేశారు.
 

కోర్టులో తన వాదన వినిపిస్తున్న అన్నా మే బ్లెస్సింగ్‌