ఉల్లికోసం వచ్చి... సొమ్మసిల్లి ... 

ఉల్లికోసం వచ్చి... సొమ్మసిల్లి ... 

ఉల్లి దేశంలో ఈ పేరు చెప్తే ప్రజలు హడలిపోతున్నారు.  ఉల్లి కోసం జనాలు బారులు తీరుతున్నారు.  ఉల్లి సబ్సిడీకి ఎక్కడ దొరికితే అక్కడైకి వెళ్లి గంటల తరబడి క్యూలైన్లో నిలబడి కొనుగోలు చేస్తున్నారు.  పెద్ద హీరో కొత్త సినిమా టికెట్స్ కోసం క్యూలో ఉన్నట్టుగా ఉంటున్నారు జనాలు. గంట కాదు రెండు గంటలు కాదు ఏకంగా ఆరేడు గంటలు క్యూలైన్లో నిలబడటం అంటే మామూలు విషయం కాదు.  

అంతసేపు నిలబడాలి అంటే చాలా కష్టమైన విషయం.  చిన్నవాళ్లు, యువకులు అంటే సరి.  కానీ, ముసలి ముతక ఎక్కువసేపు క్యూలో నిలబడగలుగుతారా... కానీ, ఉల్లి లేకుంటే శాకం రుచిగా ఉండదు కాబట్టి... ఉల్లి కోసం కష్టమైనా సరే క్యూలో ఉంటున్నారు.  ఇలా తిరుపతిలో ఉల్లికోసం క్యూలో నిలబడిన కొందరు పెద్దవాళ్ళు ఎక్కువ సేపు నిలబడలేక పాపం సొమ్మసిల్లి పడిపోయారు.