సెమీస్‌ జరగుతున్న స్టేడియం చుట్టూ 'నో ఫ్లై జోన్‌'

సెమీస్‌ జరగుతున్న స్టేడియం చుట్టూ 'నో ఫ్లై జోన్‌'

వరల్డ్‌కప్‌లో భాగంగా లీడ్స్‌లో భారత్‌, శ్రీలంకల మధ్య మ్యాచ్‌ జరుగుతుండగా 'జస్టిస్‌ ఫర్‌ కశ్మీర్‌' అనే  బ్యానర్‌తో ఓ విమానం స్టేడియం మీదుగా వెళ్లడం వివాదాస్పదంగా మారడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్‌-ఇండియా మధ్య ఇవాళ సెమీఫైనల్స్‌ జరుగుతున్న స్టేడియం పరిసర ప్రాంతాలను 'నో  ఫ్లై జోన్'గా ప్రకటించింది. అంటే.. మ్యాచ్‌ ముగిసే వరకు ఆ ప్రాంతం మీదుగా విమానాలు ఎగరకుండా నిషేధం అమల్లో ఉంటుంది. 

ఇక.. 'జస్టిస్‌ ఫర్‌ కశ్మీర్‌' అనే బ్యానర్‌ ఉన్న విమానం స్టేడియం మీదుగా వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ.. ఐసీసీకి లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేసింది. ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.