మహాభారత్ ను డైరెక్ట్ చేస్తోంది ఎవరో తెలుసా..?

మహాభారత్ ను డైరెక్ట్ చేస్తోంది ఎవరో తెలుసా..?

మహాభారతం గ్రంధాన్ని ఆధారంగా చేసుకొని సినిమా చేయాలని చాలామంది దర్శకులు అనుకుంటున్న సంగతి తెలిసందే.  అమీర్ ఖాన్ ఈ సినిమాను చేయాలని అనుకున్నారు.  అయితే, దీనిని సినిమాగా కాకుండా.. వెబ్ సిరీస్ గా తీయాలని సంకల్పించారు.  ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏమైందో తెలియదు.  

రాజమౌళి కూడా మహాభారతాన్ని సినిమాగా చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే.  అయితే, దీనికోసం కనీసం పదేళ్ళపాటు కష్టపడాల్సి వస్తుందని రాజమౌళి పేర్కొన్నారు.  ఈ దర్శక నటులు ఇలా చెప్తుంటే.. బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా మహాభారత్ పేరును రిజిస్టర్ చేయించాడు.  దీనిపై ఎప్పుడు సినిమా చేయబోతున్నారు.  ఎవరెవరు ఇందులో నటిస్తున్నారు.. అనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తారట.