యోగి సర్కార్ నుంచి మంత్రి డిస్మిస్

యోగి సర్కార్ నుంచి మంత్రి డిస్మిస్

లోక్ సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ ముగిసిన తర్వాత రోజే ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రభుత్వం సుహెల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓమ్ ప్రకాష్ రాజ్ భర్ ను మంత్రివర్గం నుంచి తొలగించింది. తన మంత్రివర్గ సభ్యుడైన ఓపీ రాజ్ భర్ ను డిస్మిస్ చేయాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ రామ్ నాయక్ కు సిఫార్సు చేశారు. వెంటనే గవర్నర్ రాజ్ భర్ ను తొలగించారు. ఈ నిర్ణయాన్ని ఓమ్ ప్రకాష్ రాజ్ భర్ స్వాగతించారు. కానీ అనేక ఆరోపణలు కూడా చేశారు. ఓపీ రాజ్ భర్  యోగి సర్కార్ లో వెనుకబడిన వర్గాల సంక్షేమం-వికలాంగుల సంక్షేమ మంత్రిగా ఉన్నారు. గడిచిన కొంత కాలంగా ఆయన బీజేపీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. దీనిపై అనేక విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.