ఒమన్ రచయిత్రికి 'మ్యాన్ బుకర్ ప్రైజ్'

ఒమన్ రచయిత్రికి 'మ్యాన్ బుకర్ ప్రైజ్'

ఒమన్ కు చెందిన రచయిత్రి జోఖా అల్హార్తి ఈ ఏడాది ప్రతిష్టాత్మక 'మ్యాన్ బుకర్ ప్రైజ్' దక్కింది. ఆమె రచించిన ‘సెలెస్టియల్ బాడీస్’ నవలకు గానూ ఈ బహుమతి సాధించారు. ఆమె రచించిన ఈ నవలను మేరిలిన్ బూత్ అనే రచయిత్రి ఆంగ్లంలోకి అనువదించారు. ‌వీరిద్దరికి కలిపి 63,000 అమెరికన్‌ డాలర్లను ‘మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్’ నిర్వాహకులు అందించారు. ‘సెలెస్టియల్ బాడీస్’ను ముగ్గురు అక్కాచెల్లెళ్ల జీవితం చుట్టూ తిరిగే కథగా ఆమె రచించారు. ఇంతవరకు ఏ అరబిక్‌ రచయిత ఈ బహుమతిని అందుకోకపోవడం విశేషం. 2005-2015 మధ్యలో రెండేళ్లకు ఓ సారి ఈ బహుమతిని ప్రదానం చేసేవారు. కానీ 2015 నుంచి ప్రతి ఏడాది ఓ రచయితకి ‘మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్’ని అందచేస్తున్నారు.