వీడియో: మణిపూర్ స్టడీ టూర్ లో ఆర్జేడీ ఎమ్మెల్యే జల్సాలు

వీడియో: మణిపూర్ స్టడీ టూర్ లో ఆర్జేడీ ఎమ్మెల్యే జల్సాలు

బీహార్ గౌరవనీయ ఎమ్మెల్యేల ఒక వివాదాస్పద వీడియో వెలుగులోకి వచ్చింది. ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఈ వీడియోలో ఆర్జేడీ ఎమ్మెల్యే యదువంశ్ కుమార్ యాదవ్ ఒక అమ్మాయి భుజం మీద బలవంతంగా చేయి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయి చేతిని తీసినప్పటికీ ఆయన ఆమె చేతులు పట్టుకొని డాన్స్ చేస్తున్నారు. ఆమెను హత్తుకొనేందుకు కూడా ప్రయత్నించారు. అంతే కాదు. తన చేతులతో ఆ అమ్మాయికి ఏదో తాగిస్తున్నారు. ఈ సంఘటన జూన్ 1న జరిగినట్టు తెలిసింది. 

ఇంఫాల్ టైమ్స్ లో ప్రచురించిన వార్తా కథనం ప్రకారం, స్టడీ టూర్ పై మణిపూర్ వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు జల్సాలు చేస్తూ కెమెరాకు దొరికిపోయారు. వీరిలో ఆర్జేడీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు జేడీయు, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని మోరెహ్ పట్టణంలో అమ్మాయితో నాట్యం చేస్తూ బీహార్ ఎమ్మెల్యేలు కెమెరాలో బందీలయ్యారు. ఎమ్మెల్యలతో నృత్యం చేస్తున్న అమ్మాయికి మైనారిటీ తీరలేదని కథనంలో తెలిపారు.