సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం.. ఇదే రోజున..!

సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం.. ఇదే రోజున..!

భారత క్రికెట్ కు ఎన్నో సేవలు అందించిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజున క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. 1996 ఏప్రిల్ 3న శ్రీలంక పై వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన ద్రావిడ్ అంతర్జాతీయ కెరియర్ లో 2012 జనవరి 24న ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఆదే ఏడాది మార్చి 9న తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక భారత్ తరపున మొత్తం 164 మ్యాచ్ లు ఆడిన ద్రావిడ్ 13288 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు ఉన్నాయి. ఇక 344 వన్డే మ్యాచ్ ల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన ది వాల్ మొత్తం 10889 పరుగులు చేసాడు. అందులో 12 సెంచరీలు 86 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఇక తన కేసరియర్ లో ఒక్కే ఒక టీ20 మ్యాచ్ ఆడిన ద్రావిడ్ 31 పరుగులు చేసాడు. అయితే భారత అండర్-19 జట్టుకు 2016-19 వరకు హెడ్ కోచ్ గా వ్యవరించిన ద్రావిడ్ ను 2019లో నేషనల్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా బీసీసీఐ నియమించింది.