అమ్మగా అమల మరోసారి

అమ్మగా అమల మరోసారి

అమల హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తరువాత అక్కినేని నాగార్జునను వివాహం చేసుకున్నాక దాదాపు సినిమాలకు దూరమైందనే చెప్పాలి. ఈ మధ్య లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ సినిమాలో అమ్మ పాత్రలో కనిపించింది. ఆతరువాత మళ్లీ నటనపై అంతగా శ్రద్ద చూపలేదు. అయితే మళ్లీ ఇప్పడు శర్వానంద్‌కు తల్లిగా కనిపించనుంది. అయితే శర్వానంద్ ఇప్పటికే శ్రీకారం పూర్తిచేసుకున్నాడు. ఇప్పుడు తన 30వ సినిమాను కూడా పూర్తిచేసుకున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటుగా తమిళ్‌లోనూ విడుదల కానుంది. మందర్ సెంటిమెంట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్‌కు అమల తల్లిగా చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను శర్వానంద్ చాలా సైలెంట్‌గా ముగించాడు. వచ్చే ఏడాదిలో మొదటగా శ్రీకారం విడుదల కానుంది. ఆ తరువాత వెంటనే ఈ సినిమా విడుదల కానుంది. మరి ప్రేక్షకులు తల్లి ప్రేమను ఎంత వరకూ ఆదరిస్తారో చూడాలి.