ఆకట్టుకుంటున్న 'అరణ్య' 'కోలు కోలోయమ్మ...' పాట మేకింగ్

ఆకట్టుకుంటున్న 'అరణ్య' 'కోలు కోలోయమ్మ...' పాట మేకింగ్

రానా, సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న 'విరాట పర్వం' సినిమా నుంచి 'కోలు కోలోయమ్మా...' పాట మేకింగ్ విడుదలైంది. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ పాటను చంద్రబోస్ రాశారు. డివైన్ లవ్ తో కూడిన ఈ పాటను గజల్స్ టైప్ లో రాయమని అడగగానే చంద్రబోస్ రాసిచ్చారని దర్శకుడు చెప్పగా... స్వచ్ఛమైన పల్లెటూరి యువతి ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న నేపథ్యంలో ఈ పాట సాగుతుందని చంద్రబోస్ వివరించారు. సాయిపల్లవిపై చిత్రీకరణించిన ఈ పాటలో విజువల్స్ హైలైట్ అవుతాయని దర్శకుడు చెబుతున్నారు. మరి ఈ పాట సినిమాకు ఎంత వరకూ ప్లస్ అవుతుందో చూడాలి.