ఆర్టికల్ 370 రద్దుపై చైనా మరోసారి విమర్శలు... 

ఆర్టికల్ 370 రద్దుపై చైనా మరోసారి విమర్శలు... 

జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసి నేటికీ ఏడాది పూర్తయింది.  అంతేకాదు, జమ్మూ కాశ్మీర్ ను రెండు రాష్ట్రాలుగా విభజించింది.  లడఖ్ ను చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతంగా, జమ్మూ కాశ్మీర్ ను చట్టసభలలో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఇది జరిగి నేటికీ ఎడారి పూర్తయింది.  ఇప్పుడిప్పుడే జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడుతున్నాయి.  ప్రజలకు భరోసా కల్పించడం, ఉపాధి కల్పించడంతో పాటుగా ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. 

ఆర్టికల్ 370 రద్దు చేసి నేటికీ ఏడాది కావడంతో దీనిపై చైనా స్పందించింది.  భారత్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం చెల్లదని, జమ్మూ కాశ్మీర్ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఇండియన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైనా విమర్శించింది.  ఇండియా పాక్ దేశాల మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కారించుకోవాలని సూచించింది.  జమ్మూ కాశ్మీర్ లోని మెజారిటీ ప్రజలు కాశ్మీర్ అంశంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని చైనా పేర్కొన్నది.  ఇక ఇండియా అంతర్గత విషయంలో చైనా జోక్యం చేసుకోవడంపై ఇండియా మండిపడుతోంది.  ఇండియా అంతర్గత విషయంలో ఎవరూ జోక్యం చేసుకున్నా ఊరుకునేది లేదని ఇండియా హెచ్చరించింది.