కర్ణాటకలో హైటెన్షన్ : ఉంటుందా ఊడుతుందా?
కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఈరోజు ఉప ఎన్నిక జరుగుతున్నది. ఈ ఉప ఎన్నికలు యడ్యూరప్ప ప్రభుత్వానికి చాలా కీలకం కానున్నది. 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కనీసం 6 స్థానాల్లో తప్పనిసరిగా గెలవాల్సిన అవసరం ఉన్నది. 6 అసెంబ్లీ నియోజక వర్గాల్లో విజయం సాధిస్తేనే ప్రభుత్వం నిలబడుతుంది. లేదంటే మరలా టెన్షన్ మొదలౌతుంది.
2018లో ఏర్పడిన కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఇటీవలే కూలిపోయింది. ఆ రెండు పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. కాగా, అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 17 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను, 15 చోట్ల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ నుంచి రాజీనామా చేసి బీజేపీ చేరిన రెబల్ అభ్యర్థులకు పార్టీ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు ఒంటరిగానే బరిలోకి దిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 9 న వెలువడుతాయి. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)