జూన్ 25 నుంచి దేశంలో మళ్ళీ లాక్ డౌన్... నిజమేనా? 

జూన్ 25 నుంచి దేశంలో మళ్ళీ లాక్ డౌన్... నిజమేనా? 

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది.  ఇప్పటికే 2.67 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.  రోజుకు తొమ్మిది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  జూన్ 8 వ తేదీ నుంచి దేవాలయాలు, మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ అన్నింటిని ఓపెన్ చేశారు.  త్వరలోనే అన్ లాక్ డౌన్ 2 ను కూడా అమలు చేసే అవకాశం ఉన్నది.  ఒకేసారి కేసుల కేసుల సంఖ్య పెరగడం ప్రారంభించింది అంటే దానికి అడ్డుకట్ట వేయడం చాలా కష్టం అవుతుంది.  

లాక్ డౌన్ ను సడలిస్తే ఇండియా వంటి దేశాల్లో కరోనాను కట్టడి చేయడం చాలా కష్టం అవుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది.  అయినప్పటికీ కూడా లాక్ డౌన్ ను సడలించారు.  దీంతో అందరూ రోడ్డుమీదకు వస్తున్నారు. రాష్ట్రాలకు, కేంద్రానికి ఆదాయ మార్గాలు లేకపోవడంతో ఇలా చేసినట్టు నిపుణులు చెప్తున్నారు.  కేసుల సంఖ్య అమెరికాలో మాదిరిగా భారీగా పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  సమూహ వ్యాప్తి చెందుతుందేమో అని భయపడుతున్నారు.  దీనిపై ఇవాళో రేపో క్లారిటీ రాబోతున్నది.  అయితే, ఇప్పుడు ఓ న్యూస్ జాతీయ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  అదేమంటే, కేసుల సంఖ్య భారీగా పెరిగితే జూన్ 25 నుంచి దేశంలో తిరిగి లాక్ డౌన్ విధించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.  చాలా దేశాలు లాక్ డౌన్ ను ఎత్తేసి తిరిగి లాక్ డౌన్ ను విధించాయి.  ఇప్పుడు ఇండియాలో కూడా అదే విధమైన పరిస్థితి కనిపిస్తోంది.  కరోనా కేసులు పెరిగిపోతే, దానికి తగినట్టుగా ఇండియాలో ఆసుపత్రులు లేవు.  చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తుంది.