ఆ టీ ఖరీదు వెయ్యి రూపాయలు...ప్రత్యేకత ఇదే... 

ఆ టీ ఖరీదు వెయ్యి రూపాయలు...ప్రత్యేకత ఇదే... 

ఒక టి దుకాణంలో చాయ్ ఖరీదు ఎంత ఉంటుంది 5,10, 15,20 లేదా 100 వరకు ఉండొచ్చు.  కానీ, కోల్ కతాలోని నీర్జాస్ టీ దుకాణంలో టి ధర మాత్రం ఏకంగా వెయ్యి వరకు ఉంటుంది.  టీ అంటే కేవలం వ్యాపారం కాకుండా వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పార్ధ గంగూలీ అనే వ్యక్తి ఈ టీ దుకాణాన్ని 2014లో ప్రారంభించారు.  దాదాపుగా 100 రకాల తేనీరు అక్కడ దొరుకుతుంది.  టీ రకాన్ని బట్టి ఖరీదు ఉంటుంది.  రూ.15 మొదలు వెయ్యి వరకు టీ ధరలు ఉంటాయి.  వంద రకాల టీలలో కూడా మస్కటెల్ టీ అనే సుగంధితో తయారు చేసే టీ ఫేమస్ అయ్యింది.  ఆ టీ కోసమే అక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు.  చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా  ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో మస్కటెల్ టీని సేవించేందుకు వస్తుంటారట.  ఉద్యోగం చేసి విసుగు చెందిన పార్ధ గంగూలీ ఏదైనా వ్యాపారం చేయాలని భావించి స్నేహితుల సహకారంతో నీర్జాస్ టీ స్టాల్ ను ఏర్పాటు చేసాడట.