హెడ్‌ కోచ్ పోస్ట్‌పై దాదా ఆసక్తికర వ్యాఖ్యలు..

హెడ్‌ కోచ్ పోస్ట్‌పై దాదా ఆసక్తికర వ్యాఖ్యలు..

టీమిండియా కోచ్ పదవులకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగిసిపోయింది.. హెడ్ కోచ్‌తోపాటు బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ సహా పలు ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది నియామకానికి కూడా బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈసారి హేమాహేమీలు హెడ్‌కోచ్ పోస్ట్ రేసులో ఉన్నారు. మరోవైపు దరఖాస్తు చేసుకుని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కూడా హెడ్ కోచ్ పోస్ట్‌పై మక్కువ ఉన్నట్టుగా ఆయనే స్వయంగా ప్రకటించారు. ఎప్పటికైనా టీమిండియాకు తాను కోచ్ గా బాధ్యతలు చేపడతానని ప్రకటించారు దాదా.. భవిష్యత్తులో తప్పకుండా కోచ్ పదవి కోసం తాను కూడా దరఖాస్తు చేసుకుంటానన్న ఆయన... ప్రస్తుతం తాను బెంగాల్ క్రికెట్ సంఘం చైర్మన్‌గా, కామెంటేటర్‌గా, ఐపీఎల్ బాధ్యతలతో బిజీగా ఉన్నానని, అయితే ఎప్పటికైనా  కోచ్ పదవి కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక, దరఖాస్తుల గడువు ముగిసినా.. కోచ్‌ను ఎంపిక చేయాల్సి ఉంది.. మరోసారి రవిశాస్త్రిని కొనసాగిస్తారా? లేక టీమిండియాను దిశానిర్ధేశం చేయడానికి కొత్త కోచ్ రానున్నాడా? అనే చర్చ సాగుతుంది.