తహశీల్దార్‌పై దాడి కేసులో మరొకరు మృతి

తహశీల్దార్‌పై దాడి కేసులో మరొకరు మృతి

తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ దాడి ఘటనలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో విజయారెడ్డిపై పెట్రోల్ దాడి జరిగినప్పుడు ఆమెను కాపాడబోయి తీవ్రంగా గాయపడ్డ చంద్రయ్య చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. సురేష్ అనే వ్యక్తి  పెట్రోల్ పోసి దాడి చేయడంతో  తహశీల్దార్‌ను కాపాడేందుకు అటెండర్ చంద్రయ్య, డ్రైవర్ గుర్నాథం ప్రయత్నించారు. విజయారెడ్డి సజీవదహనం కాగా... డ్రైవర్ గుర్నాథం తీవ్రగాయలతో చికిత్స పొందుతూ చనిపోయారు. దాదాపు నెల రోజులుగా DRDO ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అటెండర్ చంద్రయ్య కూడా ప్రాణాలు కోల్పోయారు.. శరీరం 50 శాతానికి పైగా కాలిపోవడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు....తహశీల్దార్‌పై దాడి ఘటన మొత్తం నలుగురి ప్రాణాలు తీసింది. తహశీల్దార్ విజయారెడ్డి, ఆమెపై పెట్రోల్ పోసిన సురేష్, అటెండర్ చంద్రయ్య, డ్రైవర్ గుర్నాథం చనిపోయారు. చంద్రయ్య ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబం రోదిస్తోంది. ఎవరో చేసిన తప్పుకు తాము బలైపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.