ట్రిపుల్ ఐటీ ఘటన మరువక ముందే మరో హాస్టల్ లో ?

ట్రిపుల్ ఐటీ ఘటన మరువక ముందే మరో హాస్టల్ లో ?

నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటన మరువక ముందే మచిలీపట్నంలో మరో వసతి గృహంలోకి యువకులు హల్ చల్ చేశారు. బచ్చుపేటలోని సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహంలోకి నిన్న సాయంత్రం పది మంది యువకులు వచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు వచ్చిన యువకులు సుమారు ఏడున్నర వరకు హాస్టల్‌లోనే ఉండిపోయారు. తమ స్నేహితుడి జయంతి సందర్భంగా .హాస్టల్‌లో భోజనాలు పెడతామంటూ వచ్చిన యువకులు కిచెన్‌లో స్వయంగా బిర్యానీ వండిపెట్టారు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పలు పార్టీల నేతలు, బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు వార్డెన్‌ తీరుపై మండిపడుతున్నారు. అయితే ఈ విషయం తనకు తెలియదని, తాను వచ్చేసరికే ఆ యువకులు వెళ్లిపోయారని వార్డెన్ సమాధానమిస్తున్నారు. హాస్టళ్లలో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.