మెగా ఫ్యామిలీ మీమ్స్ హంగామా!

మెగా ఫ్యామిలీ మీమ్స్ హంగామా!

మెగాస్టార్ చిరంజీవి ఏ ముహూర్తాన నిన్న సాయంత్రం 'ఆచార్య' టీజర్ గురించి మీమ్స్ రూపంలో తన స్పందన తెలియచేశాడో కానీ... సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ హీరోలు దానిని కొనసాగిస్తున్నారు. చిరంజీవి ప్రశ్నకు జవాబుగా దర్శకుడు కొరటాల శివ 'ఈ నెల 29వ తేదీ సాయంత్రం 4.05 నిమిషాలకు 'ధర్మస్థలి ద్వారాలు తెరుస్తా'మం'టూ ప్రకటించారు. అయితే... అప్పటి వరకూ వేచి ఉండటం మెగాభిమానులకే కాదు... మెగా ఫ్యామిలీ హీరోలకూ కష్టంగానే ఉంది. సాయిధరమ్ తేజ్ 'ఖైదీ నంబర్ 150'లో చిరంజీవి ఆవేశంగా చేతిలోని గొడ్డలిని నేలకేసి కొట్టే బిట్ ను ట్వీట్ చేశాడు. ఇంకెంత సేపు వెయిట్ చేయాలి అన్నట్టుగా! ఇక వరుణ్ తేజ్ అయితే... మీమ్స్ ద్వారా టీజర్ విషయంలోని ఓ ఆసక్తికరమైన అంశాన్ని రివీల్ చేశాడు. 'చరణ్‌ అన్న వాయిస్ ఓవర్ అంటకదా టీజర్ కి' అని బ్రహ్మానందం గిరిబాబుతో చెబుతూ,  'ఆహా... బయట టాక్' అనిపించాడు. నిహారిక నిన్న చిరంజీవి ట్వీట్ కు సమాధానంగా.... 'డాడీ రేపటి వరకూ వెయిట్ చేయడం కష్టం... మీరు లీక్ చేసేయండి' అంటూ ట్వీట్ చేసింది... మొత్తం మీద... 'ఆచార్య' టీజర్ విషయంలో మెగా ఫ్యామిలీ హీరోలు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.